పి.వి.సింధు ని సన్మానించిన సింగపూర్ తెలుగు సమాజం
- July 17, 2022
సింగపూర్: సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్- 2022 లో అత్యంత ప్రతిభాపాటవాలు మరియు విశ్వాసాన్ని ప్రదర్శించి టైటిల్ సాధించిన తెలుగు తేజం పి.వి.సింధు ను సింగపూర్ తెలుగు సమాజం ప్రత్యేకంగా అభినందనలు తెలిపి సన్మానించింది.వరుస విజయాలతో దూసుకు పోతూ ఈఆటతో తన కెరియర్ లోనే ఫస్ట్ సూపర్ 500 టైటిల్ తో పాటు ఈ ఏడాది మూడో టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం.ఈ సందర్భంగా అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ సింధు భారతదేశంతో పాటు తెలుగువారందరిని గర్వపడేలా చేసిందని, భవిష్యత్ లో మరిన్ని ఉన్నత కీర్తి శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. రానున్న కామన్ వెల్త్ మరియు వరల్డ్ ఛాంపియన్షిప్ గేమ్స్ లో కూడా విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలియజేసారు. తనను వ్యక్తిగతంగా కలిసి శుభాభినందనలు తెలిపిన సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గానికి సింధు కృతజ్ఞతలు తెలియజేసారు. తెలుగు సమాజం నిర్వహించే కార్యక్రమాలను తెలుసుకొని , సింగపూర్ లో నివశించే తెలుగు వారికి సమాజం చేస్తున్న సేవలను కొనియాడారు. సింగపూర్ తెలుగు సమాజం జూలై 31 న నిర్వహించనున్న బ్యాట్మింటన్ టోర్నమెంట్ లో పాల్గొననున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సమాజం ఆగష్టు 13న సింగపూర్ లో నివసించే తెలుగు వనితలకు మాత్రమే ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న నారీ (లేడీస్ నైట్) కార్యక్రమాన్ని స్త్రీ లు వినియోగించుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







