స్పైస్‌జెట్‌ ప్రయాణాలు ఆపేయండి..

- July 17, 2022 , by Maagulf
స్పైస్‌జెట్‌ ప్రయాణాలు ఆపేయండి..

న్యూ ఢిల్లీ: ఇటీవల కాలంలో తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ విమాన సర్వీసులను నిలిపేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సదరు విమానయాన సంస్థలో అనేక సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయని ప్రస్తావించింది. లాయర్ రాహుల్ భరద్వాజ్ పిటిషన్ లో ఇటీవల ఎదుర్కొంటున్న సమస్యలను పేర్కొన్నారు.

జూలై 6న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పైస్‌జెట్‌కి షోకాజ్ నోటీసు జారీ చేసింది. జూన్ 19 నుంచి విమానంలో సాంకేతిక లోపాలతో ఎనిమిది సంఘటనలు నమోదైనట్లు తెలిసింది. సురక్షితమైన, సమర్థవంతమైన నమ్మదగిన విమాన సేవలను ఏర్పాటుచేయడంలో స్పైస్‌జెట్ “విఫలమైంది” అని DGCA తెలిపింది.

నోటీసుపై స్పందించేందుకు ఎయిర్ రెగ్యులేటర్ స్పైస్‌జెట్‌కు 3 వారాల గడువు ఇచ్చింది.DGCA షో-కాజ్ నోటీసును అనుసరించి, స్పైస్‌జెట్ ఛైర్మన్ & MD, అజయ్ సింగ్ మాట్లాడుతూ.. “స్పైస్‌జెట్ విమానయానం 100 శాతం సురక్షితం” అని అన్నారు.

పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ డీజీసీఏ అధికారులు ఆదివారం రెండు గంటలపాటు సమావేశమై.. విమాన సంఘటనలపై సాధారణ సమీక్షలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com