తెలంగాణ కరోనా అప్డేట్
- July 18, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 25వేల 585 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 540 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 272 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 21, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 26 కేసులు, ఖమ్మంలో 15 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 708 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం. మరో ఊరటనిచ్చే అంశం.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8,10,318 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 01వేల 726 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 481కి చేరింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 21వేల 616 కరోనా టెస్టులు చేయగా.. 441 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని IBPC పిలుపు
- ఒమన్ తీరంలో ఆయిల్ కాలుష్యం.. 12 కిలోమీటర్ల మేర ప్రభావం..!!
- బహ్రెయిన్‌లో రెస్టారెంట్ మెనూల్లో క్యాలరీల వివరాలకు కొత్త విధానం..!
- ప్రపంచ శాంతి సందేశంతో 135 దేశాల పర్యటన.. 600 రోజుల్లో 2.5 లక్షల కిలోమీటర్లు..!!
- దుబాయ్‌లో బైక్ రైడర్‌కు రూ.4,000 దిర్హమ్స్ జరిమానా..!!
- ఇండోనేషియాలో భారీ భూకంపం.. 47కి చేరిన మరణాలు
- గుడ్‌న్యూస్.. ఖతార్ నుంచి భారత్‌కు మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ ప్రారంభం..!!
- యూరప్‌కు అక్రమంగా తరలిస్తున్న 7 కోట్ల సిగరెట్లను అడ్డుకున్న దుబాయ్ కస్టమ్స్
- ADNOC నౌక పై ఇరాన్ దాడిని ఖండించిన బహ్రెయిన్
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ







