‘భీమ్లా నాయక్’కు భార్యకు ప్రేమలో పడిందట.!

- July 20, 2022 , by Maagulf
‘భీమ్లా నాయక్’కు భార్యకు ప్రేమలో పడిందట.!

‘నాయక్’ పెళ్లాం అంటే నాయక్‌లో సగం కాదు, నాయక్‌కి డబుల్..’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్‌తో నిత్యా మీనన్ అంటే ఇదీ అని ప్రూవ్ చేసిన నటి నిత్యా మీనన్. ‘భీమ్లా నాయక్’ సినిమాలోనే కాదు, నిత్యా మీనన్ ఏ పాత్ర తీసుకున్నా, అలాగే వుంటుంది. తన పాత్రకు ప్రాధాన్యత వుండాల్సిందే. పాత్రల ఎంపిక అలాగే వుంటుంది నిత్యా మీనన్‌ది.

అందుకే హీరోయిన్లందరిలోనూ నిత్యా మీనన్ వెరీ వెరీ స్పెషల్. నిత్యా మీనన్‌ని హీరోయిన్ అనేకన్నా సహజ నటి, మంచి నటి.. అనే ట్యాగ్‌లు ఎన్నో తగిలించాలి. ఎంత చెప్పినా ఆమె నటనా టాలెంట్ ముందు అవన్నీ తక్కువే అవుతాయ్.

అందుకే నిత్య విషయంలో ఆమె నటన మాత్రమే మాట్లాడుతుంది. ఇంతవరకూ ఆమెపై ఎలాంటి అఫైర్ గాసిప్స్ క్రియేట్ కాలేదు. కానీ, ఇప్పుడు నిత్యా మీనన్ ప్రేమలో పడిందట. త్వరలో పెళ్లి చేసుకోబోతోందట అనే వార్తలు వైరల్ అవుతున్నాయ్.

మరి, నిజంగానే నిత్య పెళ్లి చేసుకోబోతోందా.? మలయాళంలో ఓ స్టార్‌ హీరోతో నిత్యా మీనన్ ప్రేమలో వుందనీ, ఆయననే త్వరలో నిత్యా పెళ్లి చేసుకోబోతోందని ప్రచారం గట్టిగా వినిపిస్తోంది. అయితే, ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే, నిత్య స్పందించి తీరాల్సిందే.
ఈ మధ్యనే సినిమాలతో పాటూ, వెబ్ సిరీస్‌లతోనూ నిత్యా మీనన్ సందడి చేస్తోంది. అందులో భాగంగానే ‘హైద్రాబాద్ మోడ్రన్ లవ్’ పేరుతో వచ్చిన వెబ్ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో స్ర్టీమింగ్ అవుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com