మొన్న హీరో, ఇప్పుడు డైరెక్టర్.. ‘కోబ్రా’కి ఏమైంది.?

- July 20, 2022 , by Maagulf
మొన్న హీరో, ఇప్పుడు డైరెక్టర్.. ‘కోబ్రా’కి ఏమైంది.?

‘పొన్నియన్ సెల్వన్’ పేరుతో రూపొందుతోన్న విక్రమ్ తాజా మూవీ తెలుగులో ‘కోబ్రా’ టైటిల్‌తో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది. 
ఈ సందర్భంగా రీసెంట్‌గా టీజర్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్ రోజే విక్రమ్ అనారోగ్యం‌తో ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం, ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చిందంటూ ప్రచారం జరగడం.. దాంతో టీజర్ ఈవెంట్ వాయిదా పడడం, విక్రమ్ హార్ట్ ఎటాక్ వార్తలు తప్పంటూ ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్లు ఖండించడం.. అందరికీ తెలిసిన సంగతే.

ఆ పై రెండు రోజులు తర్వాత జరిగిన టీజర్ ఈవెంట్‌కి పూర్తిగా కోలుకున్న విక్రమ్ అటెండ్ అయ్యి రూమర్స‌్‌కి చెక్ పెట్టిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా ఈ సినిమా డైరెక్టర్‌పై ఇలాంటి ఫేక్ వార్తలే హల్‌చల్ చేస్తున్నాయ్. మణిరత్నం ఆరోగ్యం అస్సలేం బాగా లేదని, చాలా విషమంగా వుందనీ ప్రచారం మొదలైంది నెట్టింట్లో.

దాంతో ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ ప్రచారం నేపథ్యంలో మణిరత్నం వెంటనే స్పందించారు. నాకు ఏమీ జరగలేదు. కోవిడ్ పాజిటివ్‌తో ఆసుపత్రిలో చేరాను. చాలా మైల్డ్ లక్షణాలే.. కంగారు పడాల్సిందేమీ లేదు.. అని అభిమానులకు ట్విట్టర్ వేదికగా మెసేజ్ పాస్ చేశారాయన.

హమ్మయ్యా.! రెస్సాండ్ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే, మణిరత్నాన్ని సోషల్ మీడియా వేదికగా చంపేసేవారే. అంత పనే చేస్తున్నారు ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ న్యూస్‌పై. ఇది మాత్రం చాలా అరాచకం. ఇలాంటి ఫేక్ న్యూస్ కారణంగా ఆయా వ్యక్తుల కుటుంబ సభ్యులూ, అభిమానులూ చాలా ఆవేదనకు లోనవుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com