ఈడీ ముందు హాజరైన సోనియా గాంధీ

- July 21, 2022 , by Maagulf
ఈడీ ముందు హాజరైన సోనియా గాంధీ

న్యూ ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో నేడు సోనియా గాంధీ ఈడీ ముందు హాజరయ్యారు. అయిదుగురు ఆఫీస‌ర్లు ఈమెను విచారించబోతున్నారు. అద‌న‌పు డైరెక్ట‌ర్ స్థాయి మ‌హిళా అధికారి కూడా విచార‌ణ‌లో ఉండనుంది. ఆ మ‌హిళా అధికారి ద‌ర్యాప్తు బృందానికి నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఒక‌వేళ ప్ర‌శ్న‌లు వేస్తున్న స‌మ‌యంలో సోనియా అల‌సిపోతే, ఆమెకు రెస్ట్ ఇచ్చేందుకు కూడా ఈడీ అధికారులు ప్రిపేర‌య్యారు. సోనియా వెంట త‌న కూతురు ప్రియాంకా కూడా ఈడీ ఆఫీస్ కు వచ్చారు. మరోపక్క ఈడీ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేస్తుండడం తో వారినంతా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలిస్తున్నారు.

వాస్తవానికి జూన్ 8 నే సోనియా ఈడీ ముందుకు హాజరు కావాల్సి ఉండగా.. జూన్ 02 న ఆమె కోవిడ్ -19 బారినపడింది. ఒక వారం పాటు ఆసుపత్రిలో ఉన్న సోనియా గాంధీ తన అనారోగ్యం గురించి ఈడీకి లేఖ రాశారు. విచారణను వాయిదా వేయాలని వారిని అభ్యర్థించారు. ఈడీ ఆమె అభ్యర్థనను ఆమోదించింది. సోనియా గాంధీ సమన్లను నాలుగు వారాలపాటు వాయిదా వేయాలని కోరారని, అందుకే జూలై 21న ఏజెన్సీ ముందు హాజరుకావాలని కోరింది. ఈ తరుణంలో సోనియా నేడు ఈడీ ముందు హాజరయ్యారు.ఇదే కేసు లో రాహుల్ ను సైతం దాదాపు ఐదు రోజుల పాటు సుమారు 55 గంటల పాటు ఈడీ విచారించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com