కువైట్ వెళ్లే ప్రవాసుల కోసం కొత్త రూల్..

- July 22, 2022 , by Maagulf
కువైట్ వెళ్లే ప్రవాసుల కోసం కొత్త రూల్..

కువైట్ సిటీ: కువైట్ లోకి ప్రవేశించే ప్రవాసుల కోసం కొత్త రూల్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.కొత్తగా వర్క్, ఫ్యామిలీ వీసాలపై దేశానికి వచ్చే ప్రవాసుల పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ (PCC) వెరిఫికేషన్‌ను ఇకపై ఆన్‌లైన్ ద్వారా చేయనున్నట్లు ప్రకటించింది.ఈ కొత్త రూల్‌ను మొదట భారత్‌తోనే ప్రారంభిస్తున్నట్లు తెలియజేసింది.ఆ తర్వాత మిగతా దేశాల వారికి విస్తరించనున్నట్లు పేర్కొంది.సెప్టెంబర్‌ను నుంచి ఇది అమలులోకి వస్తుందని వెల్లడించింది.కువైట్ వెళ్లే భారతీయులు మొదట మన దగ్గర ఉండే ఆ దేశానికి చెందిన రాయబార కార్యాలయంలో పీసీసీ సర్టిఫికేట్ ఫారమ్‌ను సమర్పించాలి. మనం సమర్పించిన పీసీసీ ఫారమ్‌ను కువైట్ రాయబార కార్యాలయం పరిశీలిస్తుంది. క్రాస్ చెకింగ్ తర్వాత మాత్రమే చెల్లుబాటయ్యే స్పాన్సర్‌ను ధృవీకరించడానికి ఆన్‌లైన్‌లో కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపిస్తుంది.ఇలా పీసీసీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం ఆన్‌లైన్ ద్వారానే నిర్వహించనుంది.కనుక ఆగస్టు తర్వాత కువైట్ వెళ్లే భారతీయ ప్రవాసులు దీన్ని దృష్టిలోపెట్టుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం బెటర్.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com