ఆకాశ ఎయిర్ మొట్ట‌మొద‌టి క‌మ‌ర్షియ‌ల్ విమాన సేవ‌లు..

- July 22, 2022 , by Maagulf
ఆకాశ ఎయిర్ మొట్ట‌మొద‌టి క‌మ‌ర్షియ‌ల్ విమాన సేవ‌లు..

న్యూ ఢిల్లీ: ప్రముఖ మదుపరి (ఇన్వెస్ట‌ర్) రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలాకు చెందిన‌ ఆకాశ ఎయిర్ మొట్ట‌మొద‌టి క‌మ‌ర్షియ‌ల్ విమాన సేవ‌లు ఆగ‌స్టు 7 నుంచి ప్రారంభం కానున్నాయి.మొదటి విమానం బోయింగ్ 737 మ్యాక్స్ ప్రయాణికులతో ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్ళనుంది.ముంబై-అహ్మ‌దాబాద్ మ‌ధ్య సేవ‌లు అందించే ఆకాశ ఎయిర్‌కు చెందిన విమానాలకు సంబంధించిన‌ టికెట్ల బుకింగ్‌ల‌ను ప్రారంభించామ‌ని ఇవాళ ఆ సంస్థ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.అలాగే, ఆగ‌స్టు 13 నుంచి బెంగ‌ళూరు-కొచ్చి మ‌ధ్య విమాన సేవ‌లు అందిస్తామ‌ని, వీటి బుకింగులు కూడా ప్రారంభ‌మ‌య్యాయ‌ని చెప్పింది.

ఆకాశ ఎయిర్ సంస్థ గత ఏడాది బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాల కోసం ఆర్డర్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. క‌మ‌ర్షియ‌ల్ సేవ‌ల‌కు గాను ఆ సంస్థ ఇటీవ‌ల పెద్ద ఎత్తున‌ సిబ్బందిని నియ‌మించుకుంది.ఇప్ప‌టికే కమర్షియల్‌ విమానాలు నడిపేందుకు లైసెన్సులను పొందింది. దశల వారీగా సేవ‌ల‌ను విస్త‌రించుకుంటూ పోనుంది.కొన్ని నెలల్లో దేశంలోని మరిన్ని నగరాల మధ్య ఆకాశ ఎయిర్ సేవలు అందనున్నాయని ఆ సంస్థ అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com