భారత్ కరోనా అప్డేట్
- July 23, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 21,411 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 20,726 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. అదే సమయంలో కరోనా వల్ల 67 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. దీంతో దేశంలో కరోనా వల్ల ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,25,997కు చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,31,92,379గా ఉందని పేర్కొంది.
రికవరీ రేటు 98.46 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో కరోనాకు 1,50,100 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.46 శాతంగా ఉంది. వారాంతపు పాజిటివిటీ రేటు 4.46 శాతంగా ఉందని చెప్పింది. గత 24 గంటల్లో 34,93,209 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశామని తెలిపింది. ఇప్పటివరకు దేశంలో వినియోగించిన కరోనా డోసుల సంఖ్య 201.68 కోట్లకు చేరింది. వాటిలో 92.90 సెకండ్ డోసులు, 6.93 కోట్ల బూస్టర్ డోసులు ఉన్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..