తెలంగాణ కరోనా అప్డేట్
- July 26, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది.రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.తాజాగా ఒక్కరోజు వ్యవధిలో రికార్డులో స్థాయిలో కొత్త కేసులు నమోదవడం టెన్షన్ పెట్టిస్తోంది.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 36వేల 619 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 795 మందికి పాజిటివ్ గా తేలింది.అత్యధికంగా హైదరాబాద్ లో 343 కొత్త కేసులు వచ్చాయి.రంగారెడ్డి జిల్లాలో 54 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 54 కేసులు, నల్గొండ జిల్లాలో 42 కేసులు, పెద్దపల్లి జిల్లాలో 33 కేసులు, ఖమ్మం జిల్లాలో 32 కేసులు, కరీంనగర్ జిల్లాలో 25 కేసులు గుర్తించారు.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 658 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే మరో అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 15వేల 679 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 06వేల 865 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 703గా ఉంది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 24 గంటల్లో 28వేల 306 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 581 మందికి పాజిటివ్ గా తేలింది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







