చెల్లెల్ని పరిచయం చేస్తూ, జాన్వీ కపూర్ ఉద్వేగం.!
- July 26, 2022
అతిలోక సుందరి తనయ అయిన జాన్వీ కపూర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతోంది. కానీ, తల్లి శ్రీదేవిలా స్టార్డమ్ దక్కించుకోవడంలో జాన్వీ కపూర్ దూకుడు ప్రదర్శించలేకపోతోంది.
సెలెక్టివ్ సినిమాలకు మాత్రమే పరిమితమైంది. ఆ బాలీవుడ్‌ని వదిలి బయటికి రాలేకపోతోంది. సౌత్ నుంచి అవకాశాలు వస్తున్నా, జాన్వీ కపూర్ తిరస్కరిస్తూ, అదే బోర్డర్లో వుండిపోతోంది.
ఇక, ఇప్పుడు జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ సినిమాల్లోకి తెరంగేట్రం చేసేందురు సిద్ధమైంది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ భావోద్వేగానికి లోనైంది. అమ్మ బతికుంటే, చెల్లెలి బాధ్యత తీసుకునేది. ఇప్పుడు అమ్మ స్థానంలో ఆ బాధ్యత నాపై పడింది. చిన్న వయసులో పెద్ద బాధ్యత ఇది.. అమ్మే బతికుంటే, మరోలా వుండేది.. అంటూ జాన్వీ వుద్వేగానికి గురైంది.
అయితే, ఖుషీ కపూర్ గురించి చెబుతూ, ఖుషీ తనలా కాదనీ, చాలా తెలివైంది.. మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుందనీ చెప్పింది జాన్వీ కపూర్. తన కూతురుని సౌత్, నార్త్ అనే తేడా లేకుండా స్టార్ హీరోయిన్ని చేయాలని శ్రీదేవి కలలు కనేది. జాన్వీ తొలి సినిమా చూడకుండానే శ్రీదేవి చనిపోయింది. అలా శ్రీదేవి కలలు జాన్వీ కపూర్‌తో తీరలేదు. ఒకవేళ ఖుషీ అయినా, తల్లి శ్రీదేవి లెగసీని నిలబెడుతుందేమే చూడాలి మరి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







