2024 తర్వాత ఐఎస్‌ఎస్‌కు రష్యా గుడ్ బై !
- July 27, 2022
మాస్కో: అంతర్జాతీయ రోదసీ స్టేషన్ (ఐఎస్‌ఎస్)ను 2024 తర్వాత విడిచి పెట్టాలని రష్యా నిర్ణయించింది. రష్యా రోదసీ సంస్థకి కొత్తగా నియమితులైన చీఫ్ యూరీ బొరిసొవ్ మంగవారం ఈ విషయాన్ని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి తెలిపారు.
ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యపై క్రెమ్లిన్‌కి, పశ్చిమ దేశాలకు మధ్య ఉద్రిక్తతలు చెలరేగడం, రష్యాపై కనివినీ ఎరుగని రీతిలో ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. అతర్జాతీయ రోదసీ కేంద్రం (ఐసిసి) లో అమెరికా, రష్యా కలిసి మెలిసి పనిచేస్తున్నాయి. ''మా భాగస్వాములతో మేం చేయాల్సిన పనులన్నీ పూర్తి చేస్తాం. కానీ 2024 తర్వాత అంతర్జాతీయ స్టేషన్‌ను వీడి వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నామని యూరీ బొరిసొవ్ తెలిపారు.
అప్పటికల్లా రష్యా ఆర్బిటల్ స్టేషన్‌ను ప్రారంభిస్తామని అనుకుంటున్నామని చెప్పారు. రోదసీ కార్యక్రమం అమలే తమ ప్రధాన ప్రాధాన్యత అని చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే 'గుడ్' అని పుతిన్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఉక్రెయిన్‌పై గల ఉద్రిక్తతల వల్ల ప్రభావితం కాని రంగాల్లో రోదసీ అన్వేషణ రంగం ఒకటిగా వుంది. రోదసీ పరిశ్రమ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వుందని బొరిసొవ్ అన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







