నయనతారపై కరణ్ జోహార్ వివాదాస్పద వ్యాఖ్యలు: ఫైర్ అవుతోన్న నెటిజన్లు.!

- July 27, 2022 , by Maagulf
నయనతారపై కరణ్ జోహార్ వివాదాస్పద వ్యాఖ్యలు: ఫైర్ అవుతోన్న నెటిజన్లు.!

పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో కరణ్ జోహార్ సిద్ధ హస్తుడు. బాలీవుడ్ పాపులర్ ఫిలిం మేకర్ అయిన కరణ్ జోహార్‌కి నార్త్‌తో పాటూ, సౌత్‌లోనూ పాపులారిటీ వున్న సంగతి తెలిసిందే.
ఈ మధ్య సినిమా ప్రపంచం చిన్నదైపోవడంతో, అదేనండీ ప్యాన్ ఇండియా పేరు చెప్పి, నార్త్ లేదు, సౌత్ లేదూ.. అంతా ఇండియన్ సినిమాగా చెలామణీ అవుతుండడంతో కరణ్ జోహార్ పేరు తెలియని వాళ్లు సౌత్‌లోనూ లేరంటే అతిశయోక్తి కాదేమో.

‘కాఫీ విత్ కరణ్’ షో పేరు చెప్పి కరణ్ జోహార్ మరింత పాపులర్ అయిపోయారు. అందులోనూ సౌత్ ఇండియన్ స్టార్ అయిన సమంతను ఈ షో ద్వారా ఇంటర్వ్యూ చేయడంతో కరణ్ పేరు మార్మోగిపోతోంది ఈ మధ్య. 

ఈ షో సందర్భంగానే కరణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయ్. సౌత్‌‌కి సంబంధించి మీ దృష్టిలో గొప్ప నటి ఎవరంటూ ఈ షోలో సమంతను ప్రశ్నించాడు కరణ్. ఆ ప్రశ్నకు సమంత, ఇంకెవరు నయనతార అని సమాధానమిచ్చింది. 
అయితే, నా దృష్టిలో నయనతార ఏమీ అంత గొప్ప నటి కాదంటూ కరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్టేట్‌మెంట్‌తో సోషల్ మీడియా అట్టుడికిపోతోంది. నయన్ ఫ్యాన్స్ కరణ్‌ని ఓ ఆటాడేసుకుంటున్నారు. సౌత్ స్టార్స్‌తో పెట్టుకుంటే అంతే సంగతి..అంటూ వార్నింగులు ఇచ్చేస్తున్నారు. కొందరతై నీ లాంటి వాడి లిస్టులో నయనతార వంటి నటి లేకపోవడమే బెటర్.. అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com