పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది: యూఏఈ
- March 01, 2026
యూఏఈ: యూఏఈలో సాధారణ జీవితం ఉందని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు.యూఏఈ వ్యాప్తంగా ప్రజల మద్దతకు సంబంధించి సమగ్ర భద్రతా చర్యలను తీసుకున్నట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు. 24 గంటల పాటు మెరుగైన ముందు జాగ్రత్త చర్యలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
అదేసమయంలో జాతీయ రక్షణ వ్యవస్థ సామర్థ్యం బట్టి చూస్తే, ఇప్పటివరకు ఆందోళన కలిగించే సూచికలు ఏవీ కనిపించడం లేదని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్ అజీజ్ అల్ అహ్మద్ అన్నారు. మరోవైపు యూఏఈలోని ప్రజలు, నివాసితులు ఆందోళన చెందడానికి ఎటువంటి కారణం లేదని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NCEMA) అధికారిక ప్రతినిధి డాక్టర్ సైఫ్ అల్ ధహేరి స్పష్టం చేశారు.
తాము బాగానే ఉన్నామని, తమ ఫీల్డ్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు. తప్పుడు సమాచారాన్ని వేగంగా వ్యాప్తి చేయడం, సకాలంలో అప్డేట్ లను అందించడం దేశం పారదర్శకత, సమగ్రత మరియు ఉన్నత స్థాయి వృత్తి నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.
ఇటీవలి దాడి తర్వాత పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని యూఏఈ అధికారులు నివాసితులకు హామీ ఇచ్చారు. దేశ భద్రత మరియు అత్యవసర వ్యవస్థలు అత్యున్నత స్థాయిలో సంసిద్ధతతో పనిచేస్తున్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. యూఏఈ నాయకత్వం, భద్రతా దళాల నిరంతర కృషితో యూఏఈ నేడు సురక్షితంగా ఉందని అన్నారు.
తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారి పట్ల అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ కఠినమైన విధానాన్ని అనుసరిస్తుందని అధికారులు హెచ్చరించారు.ఇందులో బాధ్యులైన వ్యక్తులను ట్రాక్ చేయడం జరుగుతుందని తెలిపారు.అధికారిక సూచనలను అందరూ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







