రియాధ్ లో అరుదుగా వరదలు... ట్రాఫిక్ గందరగోళం... పాఠశాలలు మూసివెత
- April 13, 2016
సౌదీ రాజధాని రియాధ్ లో అరుదైన తీవ్రమైన తుఫాను బుధవారం ఎడారి నగరంలో వరదలు లేవనెత్తింది ట్రాఫిక్ రద్దీ అధికమవడంతో పాఠశాలలు మూసివేయబడ్డాయి. మంగళవారం సాయంత్రం రద్దీ సమయంలో తుఫాను అలుముకుంది, కానీ ప్రాతః కాలంలో సద్దుమణిగింది కొన్ని రోడ్లు ఇప్పటికీ వరద నీటితో మునిగిపోయాయి. వరదల విపత్తును పరిష్కరించేందుకు రియాద్ తన అత్యవసర ప్రణాళికను అమలుచేయనుందని పురపాలక మండలి ప్రతినిధి మహ్మద్ అల్ శ్వయ్మన్ అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) ద్వారా చెప్పినట్లు తెలియచేయబడింది. " వరద ప్రభావిత ప్రాంతాల్లో కొందరు స్థానికులు ఫోటోలు మరియు వీడియోలు సేకరించడానికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని దీని కారణంగా వారి జీవితాలను వారే ప్రమాదంలోనికి నెట్టుకోవడం సరికాదని " ఆయన అన్నారు. ఒక ప్రధాన రహదారిపై ట్రాఫిక్ రద్దీ కనీసం కిలోమీటర్లు పాటు స్తంభించింది. మరియు అనేక వాహనాల వెల్లువలో చిక్కుకొని విఫలమయ్యాయి. నగర వీధుల్లో వరదలు ప్రవహిస్తున్నాయి.
రియాద్ లోతట్టు ఎడారి నగరంలో 5.7 మిలియన్ ప్రజలు నివసిస్తున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదు కాబడతాయి. అతి అరుదుగా మాత్రమే వర్షంను వీరు చూస్తారు. ఒక స్థానిక దినపత్రిక రాజధాని ప్రాంతం లో అన్ని పాఠశాలలు బుధవారం మూసివేయనున్నట్లు విద్యశాఖ ఉదాహరించినట్లు పేర్కొంది.
అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) తిలిపిన వివరాల ప్రకారం, నైఫ్ అరబ్ సెక్యూరిటీ సైన్సెస్ విశ్వవిద్యాలయం కూడా తరగతులు రద్దు చేసినట్లు నివేదించింది. " వాతావరణ పరిస్థితుల కారణంగా రాజ్యం యొక్క నైరుతి దిశలో, అసిర్ ప్రాంతంలో తరగతులను నిలిపి వేశారు " ఒక అధికారి చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







