న్యూగినియాలో తేలికపాటి విమానం కుప్పకూలింది
- April 13, 2016
పవువా న్యూగినియాలో తేలికపాటి విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పవువా న్యూగినియా పశ్చిమ ప్రావిన్స్ లోని కింగ్ నా ఎయిర్ పోర్టులో సదరు విమానం రన్ వేపై దిగుతున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఆస్ట్రేలియా వాసి కూడా ఉన్నాడని ఆ దేశ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య విభాగం స్పష్టం చేసింది. అతడు పవువా న్యూగినియా కు చెందిన సన్ బర్డ్ ఏవియేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడని పేర్కొంది.ఈ ప్రమాదానికి ముందు విమానంలోని ఇంజన్ పాడైందని.. ఈ నేపథ్యంలో ఈ విమానం కుప్పకూలిందని స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొంది. ఈ విమాన దుర్ఘటన బుధవారం మధ్యాహ్నం 3.00 గంటలకు చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్‌లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్‌పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్‌పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్







