దసరా కానుకగా రానా ఘాజీ చిత్రం...
- April 13, 2016
బాహుబలి చిత్రం తర్వాత రానా క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలిసారి నౌకాదళ యుద్ధం నేపధ్యంలో ఘాజీ అనే చిత్రం తెరకెక్కుతుండగా, ఈ చిత్రంలో రానా కీలక పాత్ర పోషిస్తున్నాడు. సంకల్స్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఢిల్లీ డాల్ తాప్సీ రానా సరసన జతకట్టింది. ఇండో -పాక్ యుద్ధ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కొంత మంది పాకిస్థాన్ రంగస్థల నటులను కూడా తీసుకున్నారట. అంతేకాదు వాళ్ళకి సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది.ఘాజీ సినిమాలో నటించడం తనకెంతో ఆనందంగా ఉందని రానా తెలిపారు. 'అండర్ వాటర్'కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కోసం, కొన్నిరోజుల పాటు ఉదయం నుంచి రాత్రివరకూ నీళ్లలో గడపవలసి వచ్చిందని అన్నారు రానా. ఘాజీ చిత్రంకు భారీ స్థాయిలో గ్రాఫిక్స్ వాడడం జరిగిందని, ఇందులోని స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఆశ్చర్య చకితులను చేస్తాయని తెలిపారు. పీవీపీ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను, దసరా కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్. రానా మరో వైపు బాహుబలి ది కంక్లూజన్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!







