రామ్-బోయపాటి: డబుల్ ధమాకా ఇస్తానంటోన్న ఉస్తాద్.!
- August 02, 2022
‘ది వారియర్’ సినిమాతో అంచనాల్ని అందుకోలేకపోయాడు రామ్. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి సూపర్ మాస్ హిట్ తర్వాత వరుసగా ‘రెడ్’, ‘ది వారియర్’ సినిమాల్లో నటించాడు రామ్ పోతినేని. కానీ, ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయ్.
దాంతో రామ్‌కి అర్జెంటుగా ఓ హిట్టు కావాలి. అది బోయపాటి వల్లే సాధ్యమవుతుందని రామ్ పోతినేని గట్టిగా నమ్ముతున్నాడట. ‘అఖండ’ సూపర్ హిట్టు కొట్టి, బోయపాటి మాంచి జోరు మీదున్నాడు.
అదే జోరుతో ఇప్పుడు రామ్‌ని డైరెక్ట్ చేయబోతున్నాడు. సరే, ఇంతకీ రామ్, బోయపాటి కాంబినేషన్‌లో రాబోయే మూవీ ఎలా వుండబోతోంది.? ఇదో అడ్వెంచర్ థ్రిల్లర్ అట. హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో వుండబోతున్నాయట.
అన్నట్లు ఈ సినిమాలో రామ్ డబుల్ రోల్ పోషించబోతున్నాడనీ తెలుస్తోంది. రెండు పాత్రలూ కంప్లీట్ వేరియేషన్స్ వున్న పాత్రలట. ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా షూటింగ్ చక చకా పూర్తి చేసి, గత చిత్రాల ఫెయిల్యూర్స్‌ని మరిపించే ప్లాన్‌లో వున్నాడట యంగ్ హీరో రామ్ పోతినేని.ఎంత తొందరపడినా, వచ్చే ఏడాది సమ్మర్‌కే ఈ సినిమా వచ్చేది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







