మిల్కీ ‘గుర్తుందా శీతాకాలం’: మర్చిపోయేలా వున్నారుగా.!
- August 02, 2022
మిల్కీ బ్యూటీ తమన్నానటించిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ, ఇంతవరకూ రిలీజ్‌కి నోచుకోలేదు. జూలైలోనే ఈ సినిమా రిలీజ్ కావల్సి వుంది. కానీ, అనూహ్య కారణాల వల్ల సినిమా రిలీజ్ ఆగిపోయింది.
ఆగస్ట్‌లో రిలీజ్ అవుతుందనుకున్నారు. కానీ, ఆగస్టులోనూ అనౌన్స్మెంట్ జరిగలేదు. ఇదిలాగే కొనసాగితే, ‘గుర్తుందా శీతాకాలం’.. అని టైటిల్లో వుంది కానీ, ఎన్ని శీతాకాలాలు వెళ్లిపోతాయో.. ఈ లోపు జనమే మర్చిపోయే ప్రమాదముంది. సత్యరాజ్ హీరోగా నటించిన ఈ సినిమాకి నాగ శేఖర్ దర్శకత్వం వహించారు.
కాగా, గతంలోనూ మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ అనే సినిమా పరిస్థితి ఇలాగే అయ్యింది. ఇప్పటి వరకూ ఆ సినిమా స్టేటస్ ఏంటనేదీ తెలీదు.
ఇదిలా వుంటే, తమన్నా మాత్రం కొత్త ప్రాజెక్టులు వరుసగా చేసుకుంటూ పోతోంది. రీసెంట్గా ‘ఎఫ్ 3’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తోంది.
అలాగే, మూడు హిందీ ప్రాజెక్టులు తమన్నా చేతిలో వున్నాయ్. ఒక తమిళ సినిమాలోనూ మిల్కీ బ్యూటీ సందడి చేస్తోంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







