ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు 28 లక్షల మంది
- August 04, 2022
న్యూ ఢిల్లీ: గడిచిన రెండున్నరేళ్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం 28 లక్షల మందికి పైగా భారత పౌరులు విదేశాలకు వెళ్లారని తెలిపింది కేంద్రం.జనవరి 2020-జూలై 2022 వరకు డాటాను కేంద్రం తాజాగా వెల్లడించింది.లోక్‌సభలో కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం.. ఉపాధి కోసం 2020లో 7.15 లక్షల మంది, 2021లో 8.33 లక్షల మంది విదేశాలకు వెళ్లగా, ఈ ఏడాది జూలై చివరి వరకు దాదాపు 13.02 లక్షల మంది విదేశాలకు వెళ్లారు.
విదేశాలకు వెళ్లే పౌరుల వీసాలు, లేదా వారు చెప్పిన వివరాల ఆధారంగా ఈ డాటా సేకరించారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లలో విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లిన వారి సంఖ్య తక్కువగా ఉంది. విదేశాలకు వెళ్లిన వారిలో 4.16 లక్షల మంది ఈసీఆర్ (ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్) కంట్రీస్‌కే వెళ్లారు.వీరిలో అత్యధికంగా అంటే 1.31 లక్షల మంది ఉత్తర ప్రదేశ్ నుంచి, తర్వాత 69,518 మంది బిహార్ నుంచి వెళ్లారు.కేంద్రం చెప్పిన వివరాల ప్రకారం… 17 దేశాలకు ఎమిగ్రేషన్ క్లియరెన్స్ అవసరం. ఆ దేశాలు.. అఫ్ఘనిస్తాన్, బహ్రైన్, ఇరాక్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కువైట్, జోర్డాన్, లిబియా, లెబనాన్, మలేసియా, ఒమన్, ఖతార్, సూడాన్, సిరియా, థాయ్‌లాండ్, యూఏఈ, యెమెన్. ఈ దేశాలకు వెళ్లేందుకు కచ్చితమైన క్లియరెన్స్ అవసరం.
అయితే, విదేశీయులను తమ దేశాలకు అనుమతించే విషయంలో మాత్రం ఆ దేశాలు అంత కఠినంగా వ్యవహరించడం లేదు.అలాగే ఆ దేశాలకు వెళ్లిన పౌరులకు సంబంధించిన సమాచారం కూడా అక్కడ అంత సులభంగా దొరకదు.త్వరగా సమస్యల పరిష్కారం కూడా ఉండదు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







