ఆగస్టు 19న గ్రాండ్ గా విడుదలవుతున్న'పుష్పరాజ్'
- August 04, 2022
హైదరాబాద్: కృషికి పట్టుదలకు నిలువెత్తు రూపమే "బొడ్డు అశోక్" అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కలలను కను.. వాటిని నిజం చేసుకో అన్న మాటలను అక్షరాల పాటిస్తూ.. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ రియల్ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. ప్రతి రంగంలో సక్సెస్ సాధించిన బొడ్డు అశోక్ సినిమారంగంలో కూడా తన సత్తా చాటుకోవడానికి నిర్మాతగా అడుగు పెట్టి ధ్రువ సర్జా, రచిత రామ్ హరిప్రియ జంటగా కన్నడ లో రూపొందిన 'పుష్పరాజ్ ది సోల్జర్' చిత్రాన్ని ఆర్. యస్ ప్రొడక్షన్స్ ఆర్. శ్రీనివాస్ నిర్మాణ సారద్యంలో గ్రీన్ మెట్రో మూవీస్, వి సినిమాస్ పతాకాలపై తెలుగులోకి అనువదిస్తున్నారు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 19న గ్రాండ్ గా రిలీజ్ కు సిద్దమైంది. ఈ సందర్భంగా నిర్మాత బొడ్డు అశోక్ మాట్లాడుతూ..
"భార్జరీ " సినిమా ద్వారా కన్నడ రంగంలో అడుగుపెట్టిన అర్జున్ సర్జా మేనల్లుడు ధ్రువ సర్జా. ఈయన హీరోగా కన్నడలో రూపొందిన 'పుష్పరాజ్ ది సోల్జర్' చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నాము.ధ్రువ సర్జా సరసన అందాల తార రచితా రామ్ హరిప్రియ హీరోయిన్ గా నటించింది. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది. ఇదొక లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన కమర్షియల్ అంశాలన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి.
అల్లు అర్జున్ గారు నటించిన "పుష్ప" సినిమాతో పుష్పరాజ్ పేరు ఎంతో ఫేమస్ అయ్యింది. ఎప్పుడైతే ఈ టైటిల్ పెట్టామో మా సినిమాకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా నాకు నిర్మాతగా మంచి పేరు తెస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. ప్రతి రంగంలో సక్సెస్ అయ్యే నేను సినిమా రంగంలో కూడా నిర్మాతగా సక్సెస్ అవుతానన్న నమ్మకంతో ఉన్నాను. తెలుగులో అర్జున్ చిత్రాలు ఎలాగైతే ఆదరించారో..ఈ చిత్రాన్ని కూడా అదే విధంగా ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఆగస్టు 19న గ్రాండ్ గా తెలుగు రాష్ట్రాల్లో మూవీ మాక్స్ అధినేత మామిడాల శ్రీనివాస్ ద్వారా అత్యధిక థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మా చిత్రాన్ని సక్సస్ చేస్తారని కోరుకుంటున్నాను అన్నారు.
నటీ నటులు
ధ్రువ సర్జా - రచితా రామ్ హరిప్రియ తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : గ్రీన్ మెట్రో మూవీస్, వి సినిమాస్
నిర్మాతల : బొడ్డు అశోక్, కె రవీంద్ర కళ్యాణ్
దర్శకత్వం : చేతన్‌కుమార్
సంగీతం : హరికృష్ణ
డి. ఓ. పి : శ్రేయ కొడువల్లి
పి. ఆర్. ఓ : మధు వి.ఆర్
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







