వాట్సాప్‌లో కొత్త ఫీచర్..

- August 04, 2022 , by Maagulf
వాట్సాప్‌లో కొత్త ఫీచర్..

వాట్సాప్ త్వరలో కొత్త ఫీచర్ తీసుకురాబోతుంది.గ్రూపులోని ఎవరి మెసేజ్‌నైనా ఇకపై అడ్మిన్లు డిలీట్ చేయొచ్చు.ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రయోగాత్మక దశలో ఉంది.గూగుల్ ప్లే బీటా ప్రోగ్రామ్‌ ద్వారా, వాట్సాప్ 2.22.17 అప్‌డేట్‌తో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

వాట్సాప్‌లో చాలా మంది అభ్యంతరకర మెసేజ్‌లు పోస్ట్ చేస్తుంటారు.మన దేశ నిబంధనల ప్రకారం ఏదైనా గ్రూపులో అభ్యంతరకర మెసేజ్ వస్తే దానికి పోస్ట్ చేసిన వ్యక్తే కాకుండా.. అడ్మిన్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే, అలాంటి మెసేజులను నియంత్రించే అధికారం గ్రూపు అడ్మిన్లకు ఇప్పటివరకు లేదు. కానీ, ఇకపై అడ్మిన్లకు ఈ అవకాశం కలుగుతుంది. తప్పుగా అనిపించిన, అభ్యంతరకర, అసత్య ప్రచారాలతో కూడిన మెసేజులను గ్రూపు అడ్మిన్ తొలగించవచ్చు. అది కూడా పోస్ట్ చేసిన వారి అనుమతి లేకుండానే డిలీట్ చేయొచ్చు. ఒకసారి డిలీట్ చేస్తే గ్రూపులో ఎవరికీ ఆ మెసేజ్ కనిపించదు.కానీ, మెసేజ్ డిలీట్ చేసిన విషయం మాత్రం గ్రూపులో కనిపిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com