అనుష్క మళ్లీ అలాంటి రిస్క్ చేస్తోందా.?
- August 05, 2022
జేజమ్మగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన అనుష్క, చాలా కాలంగా సినిమాలకు దూరంగా వుంటోంది. అందుకు కారణం ఆమె బరువు బాధ్యతలే. అదేనండీ, పెరిగిపోయిన బరువు కారణమే.
అనుష్క బరువు తగ్గిపోయిందట.. అంటూ ఇదిగో, అదిగో ప్రచారాలే తప్ప అనుష్క బరువు తగ్గిందే లేదు. అయితే, అనుష్క ప్రస్తుతం ‘జాతి రత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టితో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
నిజానికి ఎప్పుడో స్టార్ట్ అయ్యింది ఈ సినిమా. ఇప్పటికీ ఈ సినిమా స్టేటస్ ఏంటో తెలియ రాలేదు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలో అనుష్క లావుగానే కనిపించబోతోందట.
లావుగా.. అంటే, ‘సైజ్ జీరో’ వంటి రిస్క్ చేయబోతోందట.. అనే ప్రచారం జరుగుతోంది. ఆ సినిమాలోనే అనుష్కని అలా చూడలేకపోయాం. అయితే, స్టార్ హీరోయిన్ అయిన అనుష్క అలాంటి రిస్క్ చేయడంతో సినిమా ఫ్లాప్ అయిన అనుష్కని ప్రశంసించకుండా వుండలేకపోయారు.
అయితే, మళ్లీ అలాంటి రిస్కే అంటే, ఇది చాలా ప్రమాదకరమైన ప్రచారం అంటున్నారు. అనుష్క సినిమాలు చేయకపోయినా ఫర్లేదు కానీ, అలాంటి బరువైన పాత్రల్లో కనిపించొద్దు ప్లీజ్.! అని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారట స్వీటీకి ఫ్యాన్స్. మరి, ఈ ప్రచారం నిజమేనా.? అనుష్క మళ్లీ అలాంటి రిస్క్ చేస్తుందా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







