కాజల్ ఈజ్ బ్యాక్: చందమామ ఎంట్రీ షురూ.!
- August 05, 2022
చందమామ కాజల్ అగర్వాల్ ఇకపై సినిమాల్లో నటించదంటూ ప్రచారం జరిగింది. కరోనా టైమ్‌లో పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్, ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయ్యి ఓ బిడ్డకు జన్మనిచ్చింది కూడా. మాతృత్వపు ఆనందాన్ని ఆస్వాదించి ఇక, ఇప్పుడే కాస్త ఖాళీ అయ్యింది.
అయితే, తానింక సినిమాలకు బ్రేక్ ఇచ్చేసినట్లే.. అంటూ అంటూ ఈ మధ్య జోరుగా జరిగిన ప్రచారాలకు చెక్ చెప్పేస్తూ, నేను వచ్చేస్తున్నా.. అంటూ కాజల్ సోషల్ మీడియా ద్వారా ఓ అనౌన్స్‌మెంట్ ఇచ్చేసింది.
సెప్టెంబర్ నుంచి షూటింగులకు హాజరవుతున్నా.. అంటూ కాజల్ సంకేతాలు పంపించింది. కాజల్ చేతిలో ప్రస్తుతం వున్న సినిమా అంటే, ‘భారతీయుడు 2’ ఒక్కటే. ఆ సినిమా షూటింగులోనే పాల్గొనబోతున్నా అని కాజల్ స్వయంగా చెప్పింది.
పెళ్లయ్యి బిడ్డకు జన్మనిచ్చినా కాజల్ ఫిజిక్‌లో ఏ మాత్రం మార్పు రాలేదు. మునుపటిలానే చందమామలా మెరిసిపోతోంది. సో, కాజల్ ఓకే చేయాలే కానీ, సీనియర్ హీరోల సరసన హీరోయిన్‌గా అవకాశాలు రావడం పక్కా. చూడాలి మరి, సెకండ్ ఇన్నింగ్స్‌లో కాజల్ ఎలాంటి అవకాశాలు దక్కించుకోనుందో.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







