భారత్‌కు ఐసిస్ హెచ్చరిక...
- April 14, 2016
ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాదులు తాజాగా తమ మౌత్ పీస్ దబిక్ మేగజైన్లో భారత్ పైన దాడి చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. బంగ్లాదేశ్ ఐసిస్ నేత అబుల్ ఇబ్రహీం ఆల్ హనీఫ్ ఓ ఇంటర్వ్యూలో భారత్‌కు హెచ్చరికలు జారీ చేశాడు.బంగ్లాదేశ్‌లోని ఐసిస్ ద్వారా భారత్‌కు ప్రమాదం పొంచి ఉందని అధికారులు భావిస్తున్నారు. సదరు బంగ్లా ఐసిస్ నేత భారత్‌ను హిందువులు లేని దేశంగా చేయాలని పేర్కొన్నాడు.భారత్ పైన తమకు ప్లాన్ ఉందని, ఇందుకోసం బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో కొందరికి శిక్షణ ఇస్తున్నామని, భారత్ పైన ఆత్మాహుతి దాడులు చేస్తామని హెచ్చరించాడు. ఇందుకు తాము స్థానిక ముజాహిదీన్ లేదా భారత్‌లోని ఫైటర్స్ మద్దతు తీసుకుంటామని కూడా చెప్పాడు.భారత దేశంలోని హిందువులు ముస్లీంల పైన, ఇస్లాం పైన యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని, భారత్ హిందువులు ముస్లీంల పైన బాహాటంగా వ్యతిరేకత కనబరుస్తున్నారని చెప్పాడు.బంగ్లాదేశ్‌లోని కొందరు ముస్లీంలు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్నారని, వారు కూడా బయటకు చెప్పడం లేదన్నారు. మేం భారత్, బంగ్లాదేశ్‌లలో షరియా నిబంధనలు తెస్తామని చెప్పాడు. షరియా నిబంధనలు చేసే వరకు తాము నిద్రపోయేది లేదని చెప్పాడు. ఇరు దేశాల్లో షరియా నిబంధనలు వచ్చేదాకా యుద్ధం చేస్తామన్నాడు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







