బూస్టర్ డోస్‌గా కార్బెవాక్స్ వ్యాక్సిన్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి
- August 10, 2022
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఈ కంపెనీ తయారు చేసిన కార్బెవాక్స్ వ్యాక్సిన్‌ను బూస్టర్ డోస్‌గా వేసేందుకు ఆమోదం తెలిపింది18 సంవత్సరాలు పైబడిన వారికి టీకా అందుబాటులోకి రానున్నది.గతంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు తీసుకున్న వ్యక్తులు కార్బెవాక్స్ టీకాను బూస్టర్ డోస్‌గా ఇవ్వొచ్చని ప్రభుత్వ వర్గాలు బుధవారం తెలిపాయి. ప్రైమరీ వ్యాక్సినేషన్‌లో ఇచ్చిన డోస్‌తో పాటు బూస్టర్ డోస్‌గా వ్యాక్సిన్‌ను ఆమోదించడం ఇదే తొలిసారి. ఇమ్యునైజేషన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTIAGI)కి చెందిన కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ ఇటీవల చేసిన సిఫారసుల మేరకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆమోదముద్ర వేసింది.
18 సంవత్సరాలు పైబడిన వారు కొవాగ్జిన్, కొవిషీల్డ్ రెండో డోస్ తీసుకున్న తేదీ నుంచి ఆరు నెలల తర్వాత ప్రికాషనరీ డోస్‌గా కార్బెవాక్స్ టీకాను తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కార్బెవాక్స్ మోతాదు కోసం కొవిన్ పోర్టల్‌లో అవసరమైన మార్పులు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. బయోలాజికల్-ఈ తయారు చేసిన కార్బెవాక్స్ టీకా దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి ఆర్‌బీడీ వ్యాక్సిన్. ప్రస్తుతం జాతీయ కొవిడ్ టీకాల కార్యక్రమంలో భాగంగా 12-14 సంవత్సరాల పిల్లలకు వినియోగిస్తున్నారు. గత జూన్ 4న డీసీజీఐ 18 సంవత్సరాలు పైబడిన వారికి కార్బెవాక్స్ టీకాను ప్రికాషనరీ డోస్‌గా వేసేందుకు ఆమోదముద్ర వేసింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







