కూరగాయాల్లో రసాయన ఆనవాళ్లు.. 78 కంసైన్ మెంట్స్ ధ్వంసం

- August 11, 2022 , by Maagulf
కూరగాయాల్లో రసాయన ఆనవాళ్లు.. 78 కంసైన్ మెంట్స్ ధ్వంసం

దోహా: అగ్రికల్చరల్ క్వారంటైన్ చట్టం, పెస్ట్ ఇన్‌ఫెక్షన్ నియంత్రణను ఉల్లంఘించినందుకు జూలై నెలలో 36.68 టన్నుల బరువున్న 78 వ్యవసాయ సరుకుల కంసైన్ మెంట్లను ధ్వంసం చేసినట్లు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దేశంలోని అన్ని కస్టమ్స్ పోర్టులలో దిగుమతి చేసుకున్న 84,712 టన్నుల బరువున్న 5,452 వ్యవసాయ (కూరగాయలు, నిత్యావరసర సరుకులు) కంసైన్ మెంట్లను తనిఖీ చేసినట్లు మంత్రిత్వ శాఖ  వెల్లడించింది. అన్ని మొక్కలు, వ్యవసాయ ఉత్పత్తులు, నిత్యావరసర సరుకులు ఫైటోసానిటరీ నిబంధనలు, అగ్రికల్చరల్ క్వారంటైన్ చట్టం, పెస్ట్ ఇన్‌ఫెక్షన్ నియంత్రణలకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com