వైరల్ వీడియో: చిన్నారిని రక్షించేందుకు సౌదీ వ్యక్తి గొప్ప సాహసం
- August 11, 2022
సౌదీ: తబుక్ నగరంలో ఒంటెల రేసులో ఒంటె వెనుక నుండి పడిపోయి దాని పగ్గాలలో చిక్కుకున్న చిన్నారి ప్రాణాలను సౌదీ వ్యక్తి మహ్మద్ అల్ బలావి పెద్ద సహసం చేసి రక్షించాడు. ఈ ఘటనకు సంబంభించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పిల్లవాడు ఒంటె వెనుక నుండి పడిపోయాడు. కానీ అతను ఒంటె పగ్గాలలో చిక్కుకుపోయాడు. దీంతో అతన్ని రక్షించేందుకు అల్ బలావి తన కారు నుండి దూకి ఒంటె పగ్గాలలో చిక్కుకున్న బాలుడిని పట్టుకుని రక్షించాడు. అనంతరం అల్ బలావి మాట్లాడుతూ.. రేస్ ప్రారంభమైనప్పుడు మిషారీ అల్ వాబిసి స్వారీ చేస్తున్న ఒంటెకు జోడించిన హాల్టర్ కదలడం గుర్తించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఒంటె వేగాన్ని తగ్గించి, హాల్టర్‌ను సరిచేసేందుకు యత్నించినా అది సాధ్యం కాలేదన్నాడు. ఆ సమయంలో చిన్నారిని రక్షించడానికి వెంటనే కారు నుంచి దూకేసినట్లు వివరించాడు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







