‘ఎమర్జెన్సీ’ కోసం కంగనా అలా చేసిందా.?
- August 11, 2022
నోరు మంచిది కాదు కానీ, పని విషయంలో కమిట్మెంట్ విషయంలో కంగనాని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ముద్దుగుమ్మ కంగనా రనౌత్ కమిట్మెంట్ మరోసారి తెరపై చర్చకు వచ్చింది.
ప్రస్తుతం ఆమె ‘ఎమర్జెన్సీ’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో వున్నప్పుడే ఆమె డెంగ్యూ ఫీవర్‌తో బాధపడింది. ప్లేట్‌లెట్స్ పడిపోయి, చాలా నీరసంగా తయారైందట.
అయినా కానీ, కంగనా షూటింగ్‌కి రావడం మానలేదు. అంత నీరసంగా వుండి కూడా ఎందుకు షూటింగ్‌లో పాల్గొనాలి.? అని టీమ్ సభ్యులు కొందరు కంగనాని ప్రశ్నించగా అనారోగ్యం నా శరీరానికే కానీ, మనసుకు కాదు అని తెలివిగా సమాధానం చెప్పి యూనిట్ సభ్యుల దగ్గర మార్కులు కొట్టేసిందట కంగనారనౌత్.
కమిట్మెంట్ ఓకే, కానీ, అసలే కరోనా కాలం. ఏ చిన్న అనారోగ్యం బారిన పడినా, ఒక్కరితో పోయే యవ్వారం కాదాయె.. కంగనా చేసిన పనిని కొందరు నెటిజన్లు తప్పు పడుతున్నారట కూడా. అవును మరి, ఆమె నోటి దురుసుతో ఫ్యాన్స్‌నే కాదు, భయంకరమైన యాంటీ ఫ్యాన్స్‌ని సైతం సంపాదించుకుంది. అలాంటి వారి నుంచి ఇలాంటి రెస్పాన్సే వస్తుంది కదా.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







