ఒమన్‌లో రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు
- August 14, 2022
మస్కట్: అరేబియా సముద్రంలో లోతైన ఉష్ణమండల అల్పపీడనం ఫలితంగా రాబోయే రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశంక ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్పపీడనం కారణంగా శనివారం అల్ వుస్తా, సౌత్ షర్కియా, ధోఫర్‌లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. ఒమన్ తీరానికి అరేబియా సముద్రంలో 400 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం స్థిరపడిందని, ఇది వాయువ్యంగా పాకిస్తాన్ తీరం వైపు తిరిగే అవకాశం ఉందని పౌర విమానయాన అథారిటీ (CAA) తన ప్రత్యేక వాతావరణ నివేదికలో పేర్కొంది. ఆదివారం, సోమవారాల్లో సుల్తానేట్‌లోని అల్ వుస్తా, నార్త్ షర్కియా, సౌత్ షర్కియా, మస్కట్, దఖ్లియా, సౌత్ బతినా, దహిరా, ధోఫర్ గవర్నరేట్‌లలో ఆకాశం మేఘావృతమై.. 15-60 మిమీ వర్షపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అరేబియా సముద్ర తీరాల వెంట అలలు గరిష్ఠంగా 4 మీటర్ల ఎత్తుతో అల్లకల్లోలంగా ఉంటాయని పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







