FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022.. రవాణాలో దోహా మెట్రో కీలక పాత్ర
- August 14, 2022
దోహా: FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 కోసం ఖతార్ రైల్వేస్ కంపెనీ (ఖతార్ రైల్) సిద్ధమవుతోంది. స్టేడియంలు, అభిమానుల కార్యకలాపాల జోన్ల నుంచి ఫుట్ బాల్ అభిమానుల ట్రాన్స్ పోర్ట్ లో దోహా మెట్రో కీలక పాత్ర పోషించనుంది.ఈమేరకు తన కార్యాచరణ సన్నాహాలను ముమ్మరం చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.సన్నాహాల్లో భాగంగా గత నెలలో "ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ ఫర్ మెగా ఈవెంట్స్" అనే థీమ్‌తో ఖతార్ రైల్ తన వార్షిక సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసందే. ఖతార్‌లోని 37 స్టేషన్‌లను FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 స్టేడియంలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇప్పటికే అనుసంధానం చేశారు. మే 2019లో ప్రారంభించినప్పటి నుండి దోహా మెట్రో 8 ప్రధాన ప్రాంతీయ, అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌ల విజయంలో కీలక పాత్ర పోషించిందని రైల్వే అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







