లేడీస్ హ్యాండ్ బ్యాగ్లో దాచి బంగారం స్మగ్లింగ్
- August 16, 2022
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి అక్రమ బంగారం రవాణ వ్యవహారం వెలుగుచూసింది.అక్రమంగా తరలిస్తున్న 260 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడు హ్యాండ్ బ్యాగ్ స్టీల్ హ్యాండ్ పుష్ విస్క్ లో బంగారాన్ని కడ్డీల రూపంలో దాచాడు. అతడిపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. హ్యాండ్ బ్యాగ్ స్టీల్ హ్యాండ్ ను పగలగొట్టారు. అందులో దాచిన బంగారం బయటపడింది. గోల్డ్ ని అధికారులు సీజ్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.గోల్డ్ ఎక్కడి నుంచి తెచ్చాడు? ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అనే వివరాలు ఆరా తీస్తున్నారు.
నిందితుడు 260 గ్రాముల బంగారాన్ని ఐదు ముక్కలు చేశాడు. ఎవరూ గుర్తు పట్టకుండా లేడీస్ హ్యాండ్ బ్యాగ్ స్టీల్ హ్యాండ్ లో దాచాడు. రూ.13లక్షల 73వేల కస్టమ్స్ డ్యూటీని ఎగ్గొట్టేందుకు నిందితుడు వేసిన స్కెచ్ ఫెయిల్ అయ్యింది. లేడీస్ హ్యాండ్ బ్యాగ్ పురుషుడు దగ్గర ఉండటంతో అధికారులు డౌట్ వచ్చింది. అంతే, అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ ను ముక్కలు ముక్కలు చేశారు. అందులోంచి బంగారం బయటపడటంతో అధికారులు షాక్ అయ్యారు. అధికారులకు చిక్కకుండా గోల్డ్ స్మగ్లింగ్ కు నిందితుడు ఖతర్నాక్ స్కెచ్ వేసినా అడ్డంగా దొరికిపోయాడు.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







