ఇంద్రగంటి మోహన్ కృష్ణ నాని కాంబినేషన్ లో..
- April 15, 2016
'భలే భలే మగాడివోయ్', కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' సినిమాలతో మంచి సక్సెస్ సాధించిన నాని ఇప్పుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తిదశకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ ని 'శ్రీరామ నవమి' సందర్భంగా విడుదల చేసారు . జెంటిల్‌మన్ అనే టైటిల్ తో విడుదలైన పోస్టర్ లో ఈ నేచురల్ స్టార్ డిఫరెంట్ స్టైల్స్ లో కనిపించారు.అష్టా చెమ్మా సినిమాతో నానికు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహన్ క్రిష్ణ సరికొత్తగా ఈ సినిమాని రూపొందించినట్లు తెలిసింది. ఈ సినిమాలో నాని సరసన 'ఎక్స్ ప్రెస్ రాజా' హీరోయిన్ సురభి, మళయాళ భామ నివేదితా థామస్ నటిస్తుండగా సీనియర్ నిర్మాత శివలెంక క్రిష్ణ ప్రసాద్ తన శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ సినిమా జూన్ నెలలో విడుదల కాబోతున్నది. నాని ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







