స్వదేశానికి వచ్చిన ప్రవాసులు.. తిరిగెళ్లాక కొత్త డ్రైవింగ్ లెసెన్స్ పొందండి!

- August 22, 2022 , by Maagulf
స్వదేశానికి వచ్చిన ప్రవాసులు.. తిరిగెళ్లాక  కొత్త డ్రైవింగ్ లెసెన్స్ పొందండి!

సౌదీ అరేబియా:  భారత్ నుంచి వేలాది మంది ప్రవాసులు ఉద్యోగం, ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్తుంటారు.ఇలా వెళ్లిన కొంత మంది ప్రవాసులు.. వీసా గడువు ముగియడంతో తిరిగి స్వదేశానికి తిరిగొస్తుంటారు.ఈ క్రమంలోనే సౌదీ అరేబియాలో పొందిన కొందరి డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైర్ అవుతాయి.ఈ కోవకు చెందిన వారిని ఉద్దేశించి.. సౌదీ అరేబియా అధికారులు కీలక ప్రకటన చేశారు. 

వీసా గడువు ముగియడంతో స్వదేశానికి వెళ్లిన ప్రవాసులు.. కొత్త వీసా పై సౌదీకి తిరిగొచ్చిన తర్వాత ఎక్స్‌పైర్ అయిన డ్రైవింగ్ స్థానంలో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందొచ్చని సౌదీ జనరల్ డైరెక్టర్ ఆఫ్ ట్రాఫిక్ చెప్పారు.నూతన వీసాపై సౌదీకి తిరిగొచ్చిన ప్రవాసులు.. కొత్త రెసిడెంట్ ఐడీతో డ్రైవింగ్ లైసెన్స్‌కు అప్లై చేసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో డ్యూ ఫీజు, ఫైన్‌లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విజిట్ వీసాపై సౌదీకి వచ్చే విదేశీలు కూడా తమ ఇంటర్నేషనల్ లైసెన్స్‌ను లేదా ఫారెన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో ఏడాదిపాటు వాహనాలను నడపొచ్చని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com