పుష్పరాజ్ లేకుండానే పుష్ప 2 మొదలుపెట్టిన డైరెక్టర్
- August 22, 2022
హైదరాబాద్: పుష్పరాజ్ లేకుండానే పుష్ప 2 మొదలుపెట్టాడు డైరెక్టర్ సుకుమార్.ఈరోజు మెగా స్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ‘పుష్ప -2 ది రూల్’ ను లాంఛ్ చేశారు.ఆసక్తికరమైన విషయమేమంటే ఈ లాంఛింగ్ వేడుకల్లో పుష్పరాజ్ పాల్గొనలేదు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ లోనే ఓ మైలు రాయి చిత్రంగా ‘పుష్ప ది రైజ్’ నిలిచింది. సుకుమార్ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రెండు భాగాలుగా పుష్ప మూవీ తెరకెక్కుతుంది. మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’ డిసెంబర్ నెలలో పాన్ ఇండియా మూవీ గా విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టింది. సౌత్ , నార్త్ లలో అత్యధిక కలెక్షన్లు రాబట్టి అల్లు అర్జున్ కెరియర్ లో ఓ మైలు రాయి చిత్రంగా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ కాగానే సెకండ్ పార్ట్ షూటింగ్ ను మొదలుపెట్టాలని అనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాలతో ఆలస్యమైంది.
ఇక ఈరోజు చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా పుష్ప 2 ను ప్రారంభించారు. అల్లు అర్జున్ లేకుండానే ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం బన్నీ కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా టూర్ లో ఉన్నాడు. అందుకే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ముత్తం శెట్టి మీడియా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై పుష్ప -2 ది రూల్’ సినిమా నిర్మితం కాబోతుంది. ఫహాద్ ఫాజిల్ ప్రధాన ప్రతి నాయకుడిగా నటించబోతున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్గా కనిపించనుంది. తిరుపతిలో అరుదుగా దొరికే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా సాగనుంది. కూలీగా చేరిన పుష్పరాజ్ డాన్‌గా ఎలా ఎదిగాడనేది ఫస్ట్ పార్ట్‌లో చూపిస్తే ఇక తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించాడు. ఆ సమయంలో తనకు ఎదురైన ఇబ్బందులేంటనే దాన్ని పుష్ప ది రూల్‌లో చూపించబోతున్నారు.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్‌లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







