ఢిల్లీ లో మరోసారి నిరసనలు తెలుపుతున్న అన్నదాతలు
- August 22, 2022
న్యూ ఢిల్లీ: అన్నదాతలు మరోసారి నిరసన బాట పట్టారు. నిరుద్యోగ సమస్య, తమ మునుపటి సమస్యల పరిష్కారం కోసం జంతర్‌మంతర్ వద్ద అన్నదాతలు శాంతియుత ఆందోళనలు మొదలుపెట్టారు. నిరుద్యోగ సమస్య, తమ మునుపటి సమస్యల పరిష్కారం కోసం జంతర్‌మంతర్ వద్ద నిర్వహిస్తోన్న మహా పంచాయత్‌లో పాల్గొనాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో వివిధ రాష్ట్రాల నుంచి వందల మంది అన్నదాతలు దేశ రాజధానికి చేరుకున్నారు. ఈ ఆందోళన నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
అన్నదాతల ఆందోళనల దృష్ట్యా దిల్లీలో 144 సెక్షన్ విధించారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. గాజీపూర్, సింఘూ, టిక్రీ సరిహద్దుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి.. ఢిల్లీ లోకి వస్తున్న అన్ని వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. గాజీపూర్ సరిహద్దుల్లో దిల్లీ-మేరఠ్ ఎక్స్‌ప్రెస్ వేపై నిఘాను పటిష్ఠం చేశారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఆందోళనల్లో పాల్గొనకుండా రైతు సంఘం నేత రాకేశ్ టికాయిత్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆదివారం ఢిల్లీ కి వస్తున్న రాకేశ్‌ను గాజీపూర్ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకుని మధువిహార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







