శ్రీవారి భక్తులకు శుభవార్త..
- August 24, 2022
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా అందుబాటులోకి వచ్చాయి. అక్టోబర్ నెలకు సంబంధించి టికెట్ల కోటాను బుధవారం టీటీడీ విడుదల చేసింది. అయితే అక్టోబర్ నెలకు సంబంధించి మరికొన్ని ఆర్జిత సేవా టికెట్లను మధ్యాహ్నం 2గంటలకు లక్కీ డీప్ ద్వారా కేటాయించనున్నారు. వీటితో పాటు అక్టోబర్ నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ తదితర వర్చువల్ సేవల దర్శన కోటా టికెట్లను కూడా సాయంత్రం 4గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నారు.
ఇదిలా ఉంటే ఆర్జిత సేవ కోసం మొత్తం 54వేల టికెట్లు ఆన్ లైన్ లో టీటీడీ అందుబాటులో ఉంచింది.ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను బుక్ చేసుకోవాలంటే అధికారిక వెబ్ సైట్ https://ttdsevaonline.comలో సందర్శించి బుక్ చేసుకోవచ్చునని టీటీడీ తెలిపింది. ఇదిలాఉంటే తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.
మంగళవారం తిరుమల శ్రీవారిని 68,467 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.67కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. ఇదిలాఉంటే గత ఐదు నెలలుగా రూ. 100కోట్ల మార్కును శ్రీవారి హుండీ ఆదాయం దాటుతోంది. ఆగస్టు నెలలో ఇప్పటికే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 100కోట్ల మార్కును దాటేయగా.. ఈ నెలలో రూ. 140కోట్లకు చేరే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









