న్యూ అప్‌డేట్: చరణ్ సినిమాపై స్పందించిన శంకర్.!
- August 25, 2022
క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, వెరీ లేటెస్టుగా ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం అనుకోని యాక్సిడెంట్స్, వివాదాల కారణంగా ఆగిపోయిన ‘ఇండియాన్ 2’ సినిమాని శంకర్ మళ్లీ స్టార్ట్ చేశారు.
బాగానే వుంది. కానీ, ఈ గ్యాప్‌లో శంకర్, రామ్ చరణ్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో వుంది కూడా. ‘ఇండియన్ 2’ పట్టాలెక్కడంతో, రామ్ చరణ్ మూవీని శంకర్ పక్కన పెట్టేశాడా.? అనే అనుమానాలు సర్వత్రా మొదలయ్యాయ్.
ఈ అనుమానాలకు చెక్ పెట్టేస్తూ, చరణ్ సినిమా గురించి శంకర్ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. చరణ్ సినిమా ఆగిపోలేదు. ‘ఇండియన్ 2’ మరియు ‘RC 15’ (చరణ్ సినిమా)లను ఏకకాలంలో పూర్తి చేస్తానని చెప్పారు.
అంతేకాదు, సెప్టెంబర్‌లో చరణ్ సినిమాకి సంబంధించిన షెడ్యూల్‌ని హైద్రాబాద్, వైజాగ్‌లలో ప్లాన్ చేశామనీ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. దాంతో మెగా అభిమానులు కాస్త ఊరట చెందారు. 2023 సమ్మర్ రేస్‌లో చరణ్ సినిమా వుంటుందని శంకర్ చెప్పారు. ఇంత క్లారిటీగా చెప్పాకా, ఇక నో ఫికర్. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీనే.!
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







