రేపటి నుంచే ఆసియా కప్..
- August 26, 2022
యూఏఈ వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ లో ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఎల్లుండి భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది.ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు నెట్స్ లో ప్రాక్టీసు చేశారు. ప్రాక్టీస్ ముగిశాక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కిక్ స్కూటర్ పై వెళ్తుండగా తీసిన వీడియోను బీసీసీఐ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఐసీసీ క్రికెట్ అకాడమీ వద్ద కిక్ స్కూటర్ పై రోహిత్ ఇలా ఎంజాయ్ చేశాడు.
అలాగే, టీమిండియా ప్రాక్టీస్ చేస్తుండగా తీసిన వీడియోను కూడా బీసీసీఐ పోస్ట్ చేసింది. పాక్ తో జరిగే తొలి పోరుకు టీమిండియా సిద్ధమైందని పేర్కొంది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ భారత క్రికెటర్ విరాట్ కొహ్లీ జట్టు సభ్యులతో బిజీబిజీగా గడిపాడు. యూఏఈలో రేపటి నుంచి సెప్టెంబరు 11 వరకు ఆసియా కప్ టోర్నమెంట్ జరగనుంది. దీన్ని టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తారు.
టీమిండియా రోహిత్ శర్మ సారథ్యంలో ఈ టోర్నమెంట్ ఆడనుంది. కొహ్లీ ఆటతీరు కొంతకాలంగా సరిగ్గా ఉండడం లేదు. ఆసియా కప్ ద్వారా మళ్ళీ ఫాంలోకి రావాలని కొహ్లీ భావిస్తున్నాడు. ఆసియా కప్ దుబాయి, షార్జాలో నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ లో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్‌పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







