ప్రవాస రోగులను తరలిస్తున్న MOH

- August 26, 2022 , by Maagulf
ప్రవాస రోగులను తరలిస్తున్న MOH

కువైట్: దేశంలోని అన్ని రకాల ప్రభుత్వ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న ప్రవాసులను ప్రైవేట్ వైద్య సంస్థ(ధామన్)కు తరలించే ప్రక్రియను MOH వేగవంతం చేసింది. 

కువైట్ జేషన్ ప్రక్రియ లో భాగంగా దేశంలో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ హాస్పిటల్స్ కువైట్ పౌరల కోసమే రిజర్వు చేయబడినవి అరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

వచ్చే ఏడాది నుండి ధామన్ సెంటర్‌లో ప్రైవేట్ రంగంలోని కార్మికులందరినీ స్వీకరించడం ప్రారంభించడానికి ప్రాథమిక ఒప్పందం కుదిరింది. 


 మొదటి దశలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగంలో పనిచేసే ప్రవాసులను మాత్రమే స్వీకరిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సను కూడా నివారించి, ధామన్ ఆసుపత్రుల్లో చికిత్స చేయనున్నారు. 


ప్రస్తుతం  కువైటీస్ కోసం జాబర్ హాస్పిటల్ మాత్రమే రిజర్వ్ చేయబడింది ఇది కొత్త జహ్రా హాస్పిటల్ మరియు కొత్త ఫర్వానియా హాస్పిటల్‌కి కూడా వర్తింప జేయబోతున్నారు.

అయినప్పటికీ, ప్రభుత్వ ఆసుపత్రులు తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్న లేదా ప్రమాదాలలో చిక్కుకున్న నిర్వాసితులను స్వీకరించవచ్చు, ఎందుకంటే ఇవి అత్యవసర వైద్య సేవలు అందించే విషయంలో ముమ్మాటికీ రాజీ పడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com