విజయ్ టంగ్ స్లిప్ అవ్వకుండా వుంటే బావుండేదేమో.!
- August 27, 2022
సహజంగానే సినిమా పరిస్థితి ఏమంత బాగా లేదు. ప్రేక్షకుల్ని తమ తమ సినిమాల ద్వారా ధియేటర్లకు రప్పించడం కత్తి మీద సామే అవుతోంది మేకర్లకు లేదా.. నటీ నటులకు. స్టార్ హీరోలు సైతం దారుణమైన ఫెయిల్యూర్స్ చవి చూడాల్సి వస్తోంది.
ఈ టైమ్‌లో భారీ అంచనాల నడుమ వచ్చిన ‘లైగర్’ మూవీని ప్రేక్షకులు నిర్ధాక్షిణ్యంగా తిరస్కరించేశారు. దాంతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాస్త ఫైర్ అయ్యాడు. ఆ ఫైరింగ్‌లో అననుకూలమైన మాటలు దొర్లేశాయ్. ‘నా సినిమాను బాయ్ కాట్ చేస్తే చేసుకోండి..’ అంటూ టంగ్ స్లిప్ అయ్యాడు.
ఈ మాటలతో ఓ ధియేటర్ యజమాని కోపానికి కారణమయ్యాడు విజయ్. సినిమా నచ్చితే చూడండి.. లేదంటే మానేయండి.. అని నువ్వు ఎలా చెప్తావ్. నీ మాటల వల్ల మేం నష్టపోతున్నాం..’ అంటూ సదరు ధియేటర్ యజమాని విజయ్‌పై కస్సుబుస్సులాడాడు.
ఈ నీ ఆటీట్యూడ్ వల్లనే ‘లైగర్’ ఫెయిలైంది.. అంటూ ఆయన విజయ్‌పై అవాకులు చవాకులు పేలేశాడు. అసలే సినిమా ఫెయిలై, విమర్శల పాలైన విజయ్‌కి ఈ సమస్య ఇంకో తలనొప్పిగా తయారైనట్లుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







