వీసా బదిలీ వార్తల్లో వాస్తవం కొంతే: పీఏఎం

- August 28, 2022 , by Maagulf
వీసా బదిలీ వార్తల్లో వాస్తవం కొంతే: పీఏఎం

కువైట్: బ్లాక్ చేసిన కంపెనీల కింద ఉన్న కార్మికుల రెసిడెన్సీని కొత్త కంపెనీలకు బదలాయించడాన్ని అనుమతించడంపై ఇటీవల సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వార్తలపై పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ (పీఏఎం) స్పందించిది. ఈ వార్తల్లో ఉన్న తప్పులను ఎత్తిచూపింది. అధికార యంత్రాంగం ఎల్లప్పుడు కార్మిక ఫిర్యాదుల పరిష్కారం కోసం పనిచేస్తుందన్నారు. కార్మిక చట్టం విషయంలో జారీ చేసిన నిబంధనలు వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా బదిలీకి సంబంధించి పరిపాలనా నిర్ణయం నం. 842/2015 కొత్త యజమానికి (స్పాన్సర్), ఉద్యోగికి సంబంధించిన సవరణలని తెలిపింది. కార్మిక చట్టంలోని ఆర్టికల్స్‌లోని అంశాలు, నిబంధనలు, సవరణలు రెసిడెన్సీ బదిలీకి సంబంధించిన ప్రచారంలో ఉన్న వార్తలలో ఎటువంటి సమాచారం లేదని పీఏఎం స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com