ఈ ఏడాదిలో వీకెండ్స్ తోపాటు మిగిలింది మూడే సెలవులు
- August 28, 2022
యూఏఈ: ఈ సంవత్సరం వీకెండ్స్ కాకుండా ఇంకా మూడు మాత్రమే ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. మరోవైపు పాఠశాలలకు వేసవి సెలవులు ముగుస్తున్నందునా.. చాలా మంది ప్రభుత్వ సెలవుదినం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం మిగిలిన మూడు అధికారిక సెలవులలో మొదటిది అక్టోబర్‌లో వస్తుంది. ఇది ప్రవక్త ముహమ్మద్ (స) జన్మదినం.. ఇది అక్టోబర్ 8(శనివారం) నాడు వస్తుంది. ఇది శని-ఆదివారం సెలవు పొందే వారికి ఉపయోగం లేదు. కానీ శనివారాల్లో పని చేసే వారికి ఇది ఉపయోగం. ఇక యూఏఈ జాతీయ దినోత్సవం సెలవుదినం నాలుగు రోజుల వీకెండ్ లో భాగంగా వస్తుంది. డిసెంబర్ 1, 2, 3, 4 సెలవు దినాలుగా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం మిగిలి ఉన్న అధికారిక సెలవులను ప్లాన్ చేసి ఉపయోగించుకోండి.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







