ఎన్నారైలకు ఒకే రకమైన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్

- August 30, 2022 , by Maagulf
ఎన్నారైలకు ఒకే రకమైన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్

న్యూ ఢిల్లీ: ఎన్నారైలకు ఓ శుభవార్త..! భారత్‌లోని అన్ని రాష్ట్రాలు ఒకే రకమైన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ జారీ చేసేలా కేంద్ర రోడ్డు రవాణా శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు జారీ చేసే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్లలో తేడాలు ఉంటున్నాయి.పర్మిట్ సైజు, రంగు, ఇతర వివరాల పరంగా వ్యత్యాసాలు ఉన్నాయి. ఫలితంగా..విదేశాల్లోని భారతీయులకు ఇబ్బందులు ఎదరవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించే దిశగా కేంద్ర రోడ్డు రావాణా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. జెనీవా కన్వెన్షన్ అనుసరించి దేశమంతటా ఒకే తరహా అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లు జారీ అయ్యేలా మార్గదర్శకాలు జారీ చేసింది. అంతేకాకుండా.. క్యూఆర్ కోడ్‌తో డ్రైవింగ్ లైసెన్స్‌ను అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్‌కు అనుసంధానం చేసే సౌలభ్యాన్ని కూడా కల్పించింది.

జనీవా ఒడంబడికపై సంతకం చేసినా దేశాలు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఒక దేశం జారీ చేసే పర్మిట్‌లను మరో దేశం అనుమతించాల్సి ఉంటుంది.ఇక భారతీయ పాస్‌పోర్టు కలిగి ఇక్కడే నివస్తున్న వారు ఈ పర్మిట్ పొందేందుకు అర్హులు.ఇందు కోసం దరఖాస్తుదారులు తమ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటూ పాస్‌పోర్టు తాలూకు కాపీలు తదితర డ్యాకుమెంట్లతో ఫామ్2 దరఖాస్తు ద్వారా పర్మిట్ కోసం అప్లై చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో వీసా వివరాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం..ఏ ప్రాంతంలో నివసిస్తే అదే ప్రాంతానికి చెందిన ఆర్‌టీఓ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com