ఖతార్: ఆంధ్ర కళా వేదిక వారి ఆధ్వర్యంలో తెలుగు బాషా దినోత్సవ వేడుకలు

- August 30, 2022 , by Maagulf
ఖతార్: ఆంధ్ర కళా వేదిక వారి ఆధ్వర్యంలో తెలుగు బాషా దినోత్సవ వేడుకలు

దోహా: ఆంధ్ర కళా వేదిక ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "తెలుగు భాషా దినోత్సవం" కార్యక్రమం, వ్యావహారిక బాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి 159వ జయంతి సందర్భంగా ఈ ఏడాది కూడా 29 ఆగష్టు 2022 సోమవారం నాడు ఎంతో ఆసక్తికరంగా, ఘనంగా నిర్వహించారు. 

 పలువురు తెలుగు బాషా ప్రముఖులు మరియు అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరై తెలుగు బాషపట్ల తమకున్న అభిమానాన్ని, అభిప్రాయాలను పంచుకున్నారు.ఇంతటి బాధ్యతాయుతమైన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని అభినందించారు.   

ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ ఖతార్ లో ప్రప్రధమంగా మరియు ఉచితంగా తెలుగు బాషా తరగతుల నిర్వహణ, తెలుగు బాషా దినోత్సవం మరియు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వంటి కార్యక్రమాల నిర్వహణ కేవలం ఆంధ్ర కళా వేదిక ద్వారా మాత్రమే జరుగుతున్నందుకు చాల ఆనందంగానూ మరియు గర్వంగానూ ఉందని అన్నారు.ఈసారి కార్యక్రమానికి కూడా ఖతార్ లోని తెలుగు వారి నుండి అద్భుతమైన స్పందన వచ్చిందని, ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ బృందం చేసిన కృషి అభినందనీయమని తెలిపారు.పిల్లలకు (పద్యాలు, శ్లోకాలు, సామెతలు, తెలుగు జాతిరత్నాలు, ఎందరో మహానుభావులు) అను పలు అంశాలలో పోటీలు నిర్వహించామని, వాటిలో విజేతలుగా నిలిచిన వారికీ బహుమతులు, ప్రశంస పత్రాలు అందజేశామని తెలియజేశారు.

ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించుకోటానికి సహకరించిన ప్రాయోజితులు(స్పాన్సర్స్)కి, అలాగే పోటీల నిర్వహణకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన తెలుగు ఉపాధ్యాయినులు రజిత రెడ్డి గారికి మరియు సుధా చిత్తాప్రగడ కి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లల్ని అభినందించి ప్రోత్సహించిన సత్యనారాయణ మలిరెడ్డి,  గొట్టిపాటి రమణ, ఇంద్రగంటి ప్రసాద్ కి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి సహకరించిన స్వచ్ఛంద సేవకులు(వాలంటీర్స్)కి మరియు పోటీలలో పాల్గొన్న చిన్నారుల తల్లితండ్రులకు కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పోటీల కార్యక్రమంలో చిన్నారుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.చివరిగా కార్యక్రమానికి హాజరైన అందరికి  రుచికరమైన అల్పాహారాలు కూడా అందజేశారు.ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించిన కార్యవర్గ సభ్యులు విక్రమ్ సుఖవాసి, కెటి రావు,  సుధ(హోస్ట్),శిరీషా రామ్, రవీంద్ర,సాయి రమేష్ కి అభినందనలు తెలియజేసారు.విక్రమ్ ముగింపు సందేశంతో కార్యక్రమం ముగించారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com