లెహెంగా బటన్స్‌లో 41 లక్షల క్యాష్..
- August 30, 2022
న్యూ ఢిల్లీ: విదేశాలకు అక్రమంగా నగలు, డబ్బు తీసుకెళ్లేందుకు కొందరు కొత్త దారులు వెతుకుతుంటారు. అయితే, ఎంత ప్రయత్నించినా ఏదో ఒక రకంగా దొరికిపోతుంటారు. తాజాగా అక్రమంగా నగదు తీసుకెళ్లేందుకు కొత్త ప్లాన్ వేసిన ఒక వ్యక్తి ఎయిర్‌పోర్టు అధికారులకు దొరికిపోయాడు. అతడి ప్లాన్ చూసి అధికారులు ఆశ్చర్యపోయారు.
మిసామ్ రజా అనే వ్యక్తి మంగళవారం స్పైస్ జెట్ విమానంలో ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్లేందుకు సిద్దమయ్యాడు. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అతడి లగేజీ తనిఖీ నిర్వహిస్తున్న ఎయిర్‌పోర్టు అధికారులకు మిసామ్ ప్రవర్తన కొంచెం అనుమానాస్పదంగా అనిపించింది. దీంతో మరింత జాగ్రత్తగా అతడి లగేజీని పరిశీలించారు. మొత్తం లగేజీని ఎక్స్-రే బ్యాగేజ్ ఇన్‌స్పెక్షన్ సిస్టమ్ ద్వారా పరిశీలించగా దిమ్మదిరిగే విషయం వెలుగు చూసింది. లెహెంగా బటన్స్‌లో భారీగా నగదు దాచిన విషయాన్ని అధికారులు గుర్తించారు. 1,85,500 విలువైన సౌదీ రియల్ కరెన్సీ నోట్లను బటన్స్ లోపల, చిన్నగా మడిచి పెట్టాడు.
వాటి మొత్తం విలువ మన కరెన్సీలో దాదాపు రూ.41 లక్షల వరకు ఉంటుంది.ఒక్కో బటన్ ఓపెన్ చేసిన అధికారులు అంత పెద్ద మొత్తంలో నగదు బయటపడటం చూసి ఆశ్చర్యపోయారు. మిసాబ్ ఈ నగదుకు సంబంధించిన వివరాల్ని చూపించలేకపోయాడు. ప్రస్తుతం అతడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







