ఆసియా కప్ 2022: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హాంకాంగ్..
- August 31, 2022
దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా హాంకాంగ్, టీమిండియా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో హాంకాంగ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌ను ఉత్కంఠ రీతిలో ముగించిన భారత్‌కు తమ గ్రూప్ ‘ఎ’లో ఇది చివరి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా సూపర్-4కు చేరుతుంది. హాంకాంగ్, టీమిండియా జట్ల మధ్య ఇదే తొలి టీ20 మ్యాచ్ కావడం విశేషం. గతంలో హాంకాంగ్ జట్టుతో రెండుసార్లు వన్డేల్లో తలపడిన టీమిండియా రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి పసికూన హాంకాంగ్‌ను బెంబేలెత్తించింది. దాదాపుగా భారత్, పాక్ జాతీయులతో నిండి ఉన్న హాంకాంగ్ జట్టు రోహిత్‌సేనకు ఏవిధంగానూ సరితూగలేదు. అందుకే ఈ మ్యాచ్‌ను భారత్ బ్యాటింగ్ ప్రాక్టీస్‌గా ఉపయోగించుకోవాలనుకుంటోంది. ఎందుకంటే పాక్‌పై బౌలర్లు విశేషంగా రాణించినా బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం కాస్త తడబడింది. ముఖ్యంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫామ్ ఆందోళనకరంగా ఉంది.
శస్త్ర చికిత్స కారణంగా మూడు నెలలపాటు ఆటకు దూరమైన తను ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టీ20ని ఆసియాకప్‌లోనే ఆడాడు. కానీ పాక్‌తో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా అవుటై నిరాశపరిచాడు. అతడు బ్యాట్ ఝుళిపించేందుకు ఇంతకన్నా చక్కటి అవకాశం లభించదు. తద్వారా ఆత్మవిశ్వాసం పెంచుకుని సూపర్-4లోనూ చెలరేగవచ్చు. ఈ ఫార్మాట్‌లో 65 బంతులాడి 90 పరుగులు చేయడం కన్నా 20 బంతుల్లో 45 పరుగులే కీలకమవుతాయి. కెప్టెన్ రోహిత్ కూడా పాక్‌పై రక్షణాత్మకంగానే ఆడాడు. తనలో కూడా మునుపటి ఫామ్ కనిపించడం లేదు. అందుకే హాంకాంగ్‌పై పరుగులు సాధించడం హిట్‌మ్యాన్‌కూ అవసరమే. కోహ్లీ మిడిలార్డర్‌లో మరోసారి చెలరేగి ఫామ్ చాటుకోవాల్సి ఉంది. మరోవైపు తొలి మ్యాచ్‌లో పంత్‌ను తప్పించడంతో జట్టు సమతూకం దెబ్బతింది. పాక్ లెఫ్టామ్ స్పిన్నర్ నవాజ్‌ను ఎదుర్కొనేందుకు నాలుగో నెంబర్‌లోనే జడేజాను పంపాల్సి వచ్చింది. అయితే.. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకున్నారు. తుది జట్ల వివరాలు..
టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, అవీష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్
హాంకాంగ్: నిజాకత్ ఖాన్ (కెప్టెన్), ముర్తజా, బాబర్ హయత్, కించిత్ షా, ఐజాజ్ ఖాన్, మెకెనీ(వికెట్ కీపర్), జీషన్ అలీ, అర్షద్, ఎహ్‌సాన్ ఖాన్, ఆయుష్ శుక్లా, మహ్మద్ ఘజన్‌ఫర్
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







