పెసర హల్వా

- April 15, 2016 , by Maagulf
పెసర హల్వా

కావలసినవి : బియ్యపు పిండి - 150 గ్రాములు, పెసరపప్పు 150 గ్రాములు, కొబ్బరిపాలు- అరలీటరు, కొబ్బరినూనె - 200 గ్రాములు, నెయ్యి - 150 గ్రాములు, పంచదార - 1 కేజి, జీడిపప్పు- 50 గ్రాములు, బాదం - 50 గ్రాములు.

 తయారుచేసే విధానం: పెసరపప్పుని వేగించి మెత్తగా పొడి చేసుకోవాలి. బియ్యపు పిండిని కూడా బాగా వేగించుకోవాలి. ఒక్కొక్క టీ స్పూను చొప్పున బియ్యపు పిండిని, పెసర పిండిని విడిగా ఉంచుకోవాలి. ఇప్పుడు దళసరి పాత్రలో కొబ్బరిపాలను పోసి, బియ్యపు పిండిని, పెసరపిండిని కలుపుతూ పచ్చివాసన పోయేవరకూ వేగించి, పంచదార వేసి కరిగించాలి. 50 గ్రాముల కొబ్బరినూనె వేసి ఉడికించాలి. ప్రక్కనుంచిన టీ స్పూను బియ్యపు పిండిని, పెసరపిండిని కొద్ది నీళ్లలో జారుగా కలుపుకుని హల్వాలో వేసి ఉడికించాలి. మిగిలిన కొబ్బరినూనె, నెయ్యి వేసి చిక్కబడే వరకూ తిప్పుతూ ఉండాలి. కమ్మటి హల్వా వాసన వస్తుండగా దించి జీడిపప్పు బాదంలతో అలకరించి వేడివేడిగా తింటే బాగుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com