ఈ నెల 26న విడుదల కానున్న 'జేమ్స్ బాండ్'
- June 15, 2015
అల్లరి నరేష్ హీరోగా ఎ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రూపొందిన చిత్రం 'జేమ్స్ బాండ్'. . 'నేను కాదు నా పెళ్లాం' ట్యాగ్ లైన్. సాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాయికిశోర్ మచ్చ దర్శకుడు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 26న విడుదలకు సిద్ధమవుతుంది. చిత్ర నిర్మాత మాట్లాడుతూ ''మా బ్యానర్ లో వస్తున్న నాలుగో చిత్రం. మంచి ఎంటర్ టైనర్. ప్రస్తుతం సినిమా దాదాపు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మన్మథుడు లాంటి భర్తకు పవర్ ఫుల్ మాఫియా డాన్ లాంటి భార్య దొరికితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతాన్నందించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఆడియో, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సాయికిషోర్ గారు చక్కగా డైరెక్ట్ చేశారు. అల్లరి నరేష్ స్టయిల్ ఆఫ్ కామెడి ఉంటుంది. ప్రేక్షకులు నరేష్ చిత్రం ఎలా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారో అలాంటి కామెడి ఎంటర్ టైనర్ మూవీ ఇది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఈ నెల 26న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నాం'' అన్నారు. సంగీతం: సాయి కార్తీక్, కో ప్రొడ్యూసర్: అజయ్ సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, ప్రొడ్యూసర్: రామబ్రహ్మం సుంకర, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సాయికోశోర్ మచ్చ.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







