చెన్నైలో శోభన్ బాబు విగ్రహం వద్ద భారీ పోలీసు భద్రత

- June 15, 2015 , by Maagulf
చెన్నైలో శోభన్ బాబు విగ్రహం వద్ద భారీ పోలీసు భద్రత

చెన్నైలో ఆంధ్రుల అందగాడు శోభన్ బాబు విగ్రహన్ని కూల్చేస్తామన్న తమిళ మున్నేట్ర పడై సంస్ధ ప్రకటనతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే శోభన్ బాబు విగ్రహం వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడులోని నాగపట్నంలో ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఇటీవల తమిళ గ్రూపులు ప్రయత్నం చేశాయి. భారతదేశంలో నిషేధిత తీవ్రవాద సంస్ధ ఆయిన ఎల్టీటీఈ చీఫ్ విగ్రహం ఏర్పాటుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతించలేదు. అంతేకాదు ఏర్పాటు చేయాలనుకున్న ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకర్ విగ్రహన్ని కూడా తీసేయించారు. ఈ చర్యను ఆగ్రహించిన తమిళ వేర్పాటువాద గ్రూపులు తమిళ ఉద్యమ నేత విగ్రహం ఏర్పాటును ప్రభుత్వం సంకుచిత ధోరణితో అడ్డుకుంటుందని ఆరోపించాయి. మరో రాష్ట్రానికి చెందిన వ్యక్తుల విగ్రహలు రాజధానిలో ఉండటం ఎంత వరకు సమంజసం? అంటూ ప్రశ్నించాయి. శోభన్ బాబు విగ్రహం వద్ద నిరసన చేయాలని వచ్చిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com